లైట్ తీసుకొని పని చూస్కో.. అంటున్న రామ్ !


ఎనర్టిక్ హీరో రామ్ పబ్లిక్ ప్లేస్ ల సిగరేట్ కాల్చీ ఫైన్ కట్టిండు. గిప్పుడు గది వైరల్ అయింది. ప్రతోడు రామ్ చేసింది తప్పు అన్నట్టు కామెంట్స్ చేస్తుండు. వాటిపై తాజాగా రామ్ రెస్పాండు అయిండు. “నా టైమూ.. పబ్లిక్ టైమూ.. వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలె. షూట్ ల కాల్చిన తమ్మీ. బ్రేక్ ల కదా. టైటిల్ సాంగుల చూస్తావ్ గా స్టెప్పు. అయినా.. లా కి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినమ్. గిప్పుడు నువ్వు కూడా నా లెక్క లైట్ తీసుకొని పనిచూస్కో’ అని రామ్ ట్విట్ చేశారు.

పూరి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
సోమవారం సినిమా షూటింగ్‌ విరామ సమయంలో రామ్ పబ్లిక్ గా సిగరెట్‌ కాల్చినందుకు.. ఆయనకి పోలీసులు రూ.200 జరిమానా విధించారు. చార్మినార్‌ పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చార్మినార్‌ పోలీసులు తెలిపారు. ఈ న్యూస్ వైరల్ కావడంతో రామ్ ని ట్రోల్ చేస్తున్నారు.