ఆ రెండు ఓడితే.. ఇంగ్లాండ్ ఇంటికే.. ?


ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశ సమీపిస్తుండటంతో తొలి నాలుగు స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు సెమీస్‌ చేరడం కష్టమేమీ కానప్పటికీ తదుపరి ఆడే మ్యాచ్‌లు వాటికి కీలకంగా మారనున్నాయి. కాగా నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్రికెట్‌ కనిపెట్టిన దేశం ఇప్పటివరకూ ప్రపంచకప్‌ గెలవలేదు. దీంతో ప్రస్తుత మోర్గాన్‌సేనపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ టోర్నీకి ముందు అత్యంత ఫెవరెట్‌ జట్టుగా ఇంగ్లాండ్ పేరొందింది. ఐతే, ఆ జట్టు వరుసగా పాకిస్థాన్, శ్రీలంక జట్లతో ఓటమిపాలవ్వడం ఇబ్బందిగా మారింది. ఇంగ్లాండ్‌ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, రెండు ఓటములతో ఎనిమిది పాయింట్లు సాధించింది. తదుపరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్‌ లాంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోవాలంటే కనీసం రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంది.లేదంటే మరోసారి ఆశాభంగమే.

కాగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఈ టోర్నీలో ఓటమిలేకుండా దూసుకుపోతున్నాయి. అలాగే ప్రపంచకప్‌ చరిత్రలో ఈ మూడు జట్లపైనా ఆతిథ్య జట్టకు చెప్పుకోదగ్గ చరిత్ర లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోవాలంటే కనీసం రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం మరోసారి ఆ జట్టుకు ఆశా భంగమే కానుంది.