సెమీఫైనల్లో ఆస్ట్రేలియా
ప్రపంచకప్ లో అంచనాలు తలకిందులవుతున్నాయి. నంబర్‌వన్ జట్టుగా భావించిన ఇంగ్లాండ్ ఇప్పుడు లీగ్ దశలోనే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా.. ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. ఆసీస్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (100; 116 బంతుల్లో 11×4, 2×6), వార్నర్ (53; 61 బంతుల్లో 6×4) రాణించడంతో.. మొదట ఆస్ట్రేలియా 7వికెట్లకు 285పరుగులు సాధించింది.
లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 44.4 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్ (89; 115 బంతుల్లో 8×4, 2×6) మరోసారి పోరాడినా ఫలితం లేకపోయింది. 56కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. స్టోక్స్ పోరాడిన ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్లు బెరెన్‌డార్ఫ్ (5/44), స్టార్క్ (4/43) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
Starc gets Stokes with a 😍 yorker!#CmonAussie | #CWC19 pic.twitter.com/9BRwsv4YpW
— ICC (@ICC) June 25, 2019