10 రోజుల్లో 4 మ్యాచ్‌లు


ప్రపంచకప్‌ లో భారత్‌ అసలు సవాల్‌ ఎదుర్కోబోతుంది. 18 రోజుల్లో రద్దయిన ఒక పోరుతో పాటు ఐదు మ్యాచ్‌లు ముగించిన కోహ్లీసేన.. 10 రోజుల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. చివరి 4 మ్యాచ్‌ల కోసం కాలంతో పరుగెత్తనుంది. ఈనెల 27న మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో, 30న బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో, జులైన 2న బర్మింగ్‌హామ్‌లో బంగ్లాదేశ్‌తో, 6న లీడ్స్‌లో శ్రీలంకతో టీమ్‌ఇండియా తలపడనుంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలో విండీస్‌, ఇంగ్లాండ్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది.

చివరి 4 మ్యాచ్‌లు భారత్‌ ఫిట్‌నెస్‌, శక్తిసామర్థ్యాలకు పరీక్షగా నిలవనున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాడు. భువి, విజయ్ శంకర్ కు గాయాలయ్యాయి. హార్థిక్ పాండ్యా, కేదార్ జాదవ్ పూర్తి ఫిట్ నెస్ లో లేరని చెబుతున్నారు. హార్థిక్ పాండ్యా చాన్నాళ్ల నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో 10రోజుల్లో 4మ్యాచ్ లు భారత్ ఫిట్ నెస్ సమస్యలని ఎత్తి చూపిస్తుందా ? ఫిట్ నెస్ సమస్యల నుంచి బయటపడుతుందా ?? చూడాలి.