‘నంది’ కాస్త ‘సైకిల్’ అయ్యింది.. !!
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో నానా రచ్చ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం తొలిసారి ప్రకటించిన ‘నంది అవార్డు’లపై ఇండస్ట్రీ నుంచి తీవ్ర అభ్యంతారాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వివాదంలో ఇప్పటి వరకు మూడు పాయింట్స్ బయటికొచ్చాయి. ప్రాంతీయ బేధం చూపించారన్నది ప్రధాన ఆరోపణ.
గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రానికి అవార్డు రాకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయనకు మద్దతుగా ఆర్. నారాయణ మూర్తి గొంతుకలిపాడు. రుద్రమదేవి కి అవార్డు దక్కకపోవడం కారణం ప్రాంతీయ విభేదం చూపడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేవలం కాపు, టీడీపీ పార్టీ చెందిన వారికే అధిక అవార్డులు ఇచ్చారన్నది మరో ఆరోపణ. నందమూరి హీరోల సినిమాలకు అధిక అవార్డులు రావడం ఇందుకు కారణం. దీంతో.. అవి నంది అవార్డులు కాదు.. ‘సైకిల్’ పార్టీ అవార్డులని బడా నిర్మాత బండ్ల గణేష్ ఆరోపించారు. మరో ఆరోపణ కూడా ఉంది. మెగా ఫ్యామిలీ కి అన్యాయం జరిగింది. దీనిపై నిర్మాత బన్నీ వాసు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి.. నంది అవార్డులు నానా రచ్చకు దారితీశాయి.