అందుకే అమలాపాల్ తప్పుకొందట !


వెంకట్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా అమలాపాల్ ని తీసుకొన్నట్టు వార్తలొచ్చాయ్. ఐతే, ఇప్పుడు అమలా స్థానంలో మేఘా ఆకాష్ ని తీసుకొన్నట్టు తెలుస్తోంది.

ఇంతకీ విజయ్ సినిమా నుంచి అమలా ఎందుకు తప్పుకొంటున్నట్టు ? అంటే.. ఆమె ముందు ఒప్పుకున్నప్పుడు అడిగిన రెమ్యూనరేషన్‌ కన్నా ఇప్పుడు ఎక్కువగా అడగడంతోపాటు పలు షరతులు కూడా ఆమె పెట్టినట్లు వినికిడి. అందుకే నిర్మాత కాదన్నారని, ఆమె తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాల్షీట్‌ సమస్య వల్ల ఆమె నటించలేదని కూడా వినిపిస్తోంది.

ఇక, అమలా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆమె’ టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అమలా న్యూడ్ గా కనిపించి షాక్ ఇచ్చింది.