బుర్రకథ వాయిదా


ఈవారం మూడు సినిమాలు రిలీజ్ కావాల్సివుంది. బ్రోచెదెవరురా, కల్కీ, బుర్రకథ సినిమాలు బాక్సాఫీస్ వద్దపోటీ పడాల్సి ఉంది. ఐతే, ఇప్పటివరకు బుర్రకథ సెన్సార్ కాలేదు. ప్రస్తుతం వున్న సెన్సారు అధికారి చాలా స్ట్రిక్ట్ గా వుంటున్నారు. పద్దతులు పాటించకుండా సినిమాలు చూడడంలేదు. గురువారం కూడా బుర్రకథ సెన్సార్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ‘బుర్రకథ’ ఓ వారం వెనక్కి వెళ్లి ‘ఓ బేబీ’, రాజ్ దూత్ సినిమాలతో పోటీపడాల్సి వుంటుంది. లేదంటే మరింత వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. సినిమాలతో పోటీపడాల్సి వుంటుంది. ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో ఆది సాయి కుమార్‌ నటించిన చిత్రం ‘బుర్రకథ’. మిస్త్రీ చక్రవర్తి, నైరా షా కథానాయికలు. ఒకే బుర్ర‌లో ఇద్ద‌రు మ‌నుషులుంటే కాన్సెప్ట్ తోబుర్రకథ తెరకెక్కింది.