టీమిండియా ఘన విజయం
విండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. 125 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరగులు చేసింది. కోహ్లీ, ధోని అర్థ శతకాలు సాధించారు. 269 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 34.2 ఓవర్లలో 143 పరుగులకే చాపచుట్టేసింది.
ఆరంభంలోనే విండీస్ కి షాక్ తగిలింది. ఐదో ఓవర్ లో షమి బౌలింగ్‌లో క్రిస్‌గేల్ 6(19) కేదార్ జాధవ్ చేతికి చిక్కాడు. ఏడో ఓవర్ లో షై హోప్5(10)ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. సునీల్ ఆంబ్రిస్ (31; 40బంతుల్లో 2×4), పూరన్(28; 50బంతుల్లో 2×4) ఇన్నింగ్స్ ని చక్కదిద్దే పయత్నం చేసినా.. భారత బౌలర్ల అద్భుత బౌలింగ్ తో వరుస వికెట్లు పడగొట్టారు. బుమ్రా 27వ ఓవర్‌లో వరుస బంతుల్లో ఇద్దర్ని ఔట్ చేశాడు. తొలి బంతికి బ్రాత్‌వైట్(1), రెండో బంతికి అలెన్(0)ని పెవిలియన్‌కు చేర్చాడు. ఈ విజయంతో టీమిండియా ఐదు విజయాలతో 11 పాయింట్లు సాధించింది. విండీస్ సెమీస్ అవకాశాలు మరింత సంక్షిష్టం అయ్యాయి.