నమిత ‘పెళ్లి పెద్ద’ ఎవరో తెలుసా ?

బొద్దుగుమ్మ నమిత పెళ్లి పీఠలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 24న నమిత తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లాడబోతోంది. వీరి వివాహం తిరుపతిలో జరగనుంది. ఇప్పటికే పెళ్లి పత్రికలు వచ్చేశాయ్. టాలీవుడ్ సినీ ప్రముఖులకి ఆహ్వానాలు కూడా అందాయి. నవంబర్ 22న సాయంత్రం తిరుపతి సింధూరి పార్క్ హోటల్’లో నమిత, వీరేంద్ర చౌదరిల సంగీత్ ఫంక్షన్ జరగనుంది. నవంబర్ 24న తిరుపతి ఇస్కాన్‌లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరుగనుంది.

నమిత – వీరేంద్ర చౌదరి పెళ్లికి బాలకృష్ణ హాజరుకాబోతున్నారు. అతి తక్కువ మంది అతిథుల మధ్య జరగనున్న నమిత పెళ్లికి బాలయ్య పెళ్లి పెద్దగా వ్యవహరించబోతున్నట్టు చెప్పుకొంటున్నారు. సింహా సినిమాలో నమిత బాలయ్యకు జంటగా నటించింది. ఆ చనువుతోనే తమ పెళ్లికి చీఫ్ గెస్ట్ గా బాలయ్యని ఆహ్వానించిందని చెబుతున్నారు.

ఈ పెళ్లికి హీరో బాలకృష్ణతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగులో ‘సొంతం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ నమిత వెంకటేష్‌తో ‘జెమిని’, బాలకృష్ణతో ‘సింహా’ తదితర సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.