రివ్యూ : కల్కీ

చిత్రం : కల్కీ (2019)

నటీనటులు : రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, నాజర్‌, రాహుల్ రామ‌కృష్ణ, చరణ్‌ దీప్‌, పూజిత పొన్నాడ తదితరులు

సంగీతం : శరవణన్‌ భరద్వాజ్‌

దర్శకత్వం : ప్రశాంత్‌ వర్మ

నిర్మాత : సి. కల్యాణ్‌

రిలీజ్ డేట్ : 28జూన్, 2019.

‘గరుడవేగ’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు యాంగ్రి యంగ్ మేన్ రాజశేఖర్. ‘అ!’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడు అనిపించుకొన్నాడు ప్రశాంత్ వర్మ. వీరిద్దరు ‘కల్కీ’ కోసం కలిశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరీ.. ఆ అంచనాలని కల్కీ ఏ మేరకు అందుకొన్నాడు ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ

కథ :

కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే న‌ర‌స‌ప్ప (అశుతోష్‌ రాణా) ఎన్నో అరాచ‌కాలకు పాల్పడుతుంటాడు. న‌ర‌స‌ప్ప త‌మ్ముడు శేఖ‌ర్‌బాబు (సిద్ధు జొన్నల‌గ‌డ్డ‌) మాత్రం ఊళ్లో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఇంత‌లో శేఖ‌ర్‌బాబు దారుణ హ‌త్యకు గుర‌వుతాడు. ఊళ్లో చెట్టుకి వేలాడ‌దీసి కాల్చేస్తారు. అత‌ని హ‌త్య కేసుని ప‌రిశోధించ‌డానికి ఐపీఎస్ అధికారి క‌ల్కి (రాజ‌శేఖ‌ర్) ఊళ్లోకి అడుగుపెడ‌తాడు. ఆ క్రమంలో క‌ల్కికి ఎలాంటి విష‌యాలు తెలిశాయి ? శేఖ‌ర్‌బాబుని సోదరుడే చంపాడా ? ఆయన స్నేహితుడు పెరుమాండ్లా (శత్రు) నా ? అస‌లు ఆ హ‌త్య కేసుని క‌ల్కి ఎలా ఛేదించాడు? అనేది కథ.

ప్లస్ పాయింట్స్ :

* స్టోరీ లైన్

* క్లైమాక్స్

* నటీనటులు

మైనస్ పాయింట్స్ :

* ఫస్టాఫ్

* స్క్రీన్ ప్లే

* నేపథ్య సంగీతం

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్టుగా ఒక హ‌త్య కేసు పరిశోధన నేపథ్యంలో సాగే చిత్రమిది. ఉత్కంఠ సన్నివేశాలు, అదిరిపోయే ట్విస్టులు పడితే.. ప్రేక్షకుడికి ఉక్కిరిబిక్కిరి చేసే లైన్ ఇది. ఐతే, స్క్రీన్ ప్లే గ్రిప్పింగా సాగలేదు. చాలా స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టుగా సాగుతుంటాయి. ప్రథ‌మార్ధంలో కథేమీ లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలు సాగ‌దీసిన భావ‌న క‌లుగుతుంది.

ప్రీ క్లైమాక్స్ నుంచి కథలో వేగం పెరుగుతుంది. ప్రథ‌మార్ధంలో లేవ‌నెత్తిన అనుమానాల్ని ఒక్కొక్కటిగా నివృత్తి చేసే క్రమంలో క‌థ ముందుకు సాగుతుంది. చివ‌రి ప‌ది నిమిషాలు సినిమాకి కీల‌కం. శేఖ‌ర్‌బాబుని ఎవరు హ‌త్య చేశార‌న్న విషయం బయటపడే సమయంలో వచ్చే సన్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ‘క‌ల్కి’ ఉత్కంఠ రేకెత్తించ‌డంలో విఫ‌ల‌మైంది.

పోలీస్ పాత్రలు రాజ‌శేఖ‌ర్ కు కొట్టిన‌పిండే. మరోసారి ఖాకీ డ్రస్ పవర్ చూపించారాయన. సెకాంఢాఫ్ లో ఆయన నటన బాగుంది. అదాశ‌ర్మ వైద్యురాలిగా అందంగా క‌నిపించింది. నందితా శ్వేత పాత్ర క‌థ‌లో కీల‌కం. కానీ కొన్ని స‌న్నివేశాల్లోనే ఆమె క‌నిపిస్తుంది. రాహుల్ రామ‌కృష్ణ క‌థానాయ‌కుడితో పాటే క‌నిపిస్తుంటారు. ఆయ‌న యాస‌తో, న‌ట‌న‌తో చాలా స‌న్నివేశాల్లో న‌వ్వించారు. విలన్ పాత్రల్లో అశుతోష్ రాణా, శ‌త్రులు బాగా నటించారు. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

‘అ!’ లాంటి విభిన్నమైన సినిమాతో ఆకట్టుకొన్న ప్రశాంత్ వర్మ… ‘కల్కీ’ సరిగ్గా డీల్ చేయలేకపోయారు. కథనం గ్రిప్పింగ్ గా సాగలేదు. శరవణన్‌ భ‌ర‌ద్వాజ్ పాటలు, నేపథ్య సంగీతం సాదాసీదాగానే ఉన్నాయి. దాశ‌ర‌థి శివేంద్ర కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ బోరింగ్ అనిపించాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

రేటింగ్ : 2.75/5

చివరగా : ‘కల్కీ’ కొన్ని చోట్ల మాత్రమే బాగున్నాడు