రివ్యూ : బ్రోచేవారెవరురా
చిత్రం : బ్రోచేవారెవరురా (20190)
నటీనటులు : శ్రీవిష్ణు, సత్యదేవ్, నివేదా థామస్, నివేదా పేతురాజు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
నిర్మాత : విజయ్ కుమార్ మన్యం
రేటింగ్ : 3.5/5
శ్రీవిష్ణు, సత్యదే 3.5 వ్, నివేదా థామస్, నివేదా పేతురాజు, ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘మెంటల్ మదిలో’ ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. విభిన్నమైన సినిమాగా అనిపించింది. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరీ.. సినిమా ప్రేక్షకులని అంచనాలని అందుకొందా ? ‘బోచేవారెవరురా’ కథేంటీ ? ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నది సత్యరాజ్ లక్ష్యం. ఆ ప్రయత్నాల్లో ఉండగా.. స్టార్ హీరోయిన్ షాలిని (నివేదా పేతురాజు)కి కథని వినిపించే అవకాశం దక్కుతుంది. ఈ కథకి సమాంతరంగా ఆర్3 గ్యాంగ్ రాహుల్ (శ్రీవిష్ణు), రాంబో (రాహుల్), రాంకీ (ప్రియదర్శి),
వీరి స్నేహితురాలు మిత్ర (నివేదా థామస్)ల కథ నడుస్తుంది. ఇంటి నుంచి పారిపోయిన మిత్రకు ఆర్3 గ్యాంగ్ సాయం చేస్తుంది.
ఈ రెండు కథల మధ్య లింకేటీ ? మిత్ర ఎందుకు ఇంటి నుంచి పారిపోయింది ? ఆర్3 గ్యాంగ్ అరాచకాలు ఏంటీ ?? అన్నది కథ.
ప్లస్ పాయింట్స్
* వినోదం
* కథనం
* నటీనటులు
* సంగీతం
మైనస్ పాయింట్స్
* కొన్ని చోట్ల స్లో నేరేషన్ (సెకాంఢాఫ్ లో)
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
పలు కోణాల్లో నడిచే కథ ఇది. ఈ కథని దర్శకుడు డీల్ చేసిన విధానం ఆకట్టుకొంది. పూర్తి వినోదాత్మకంగా కథని నడిపించారు. సస్పెన్స్ సన్నివేశాలకి సైతం కామెడీని మిక్స్ చేసి కొత్తగా చూపించారు. ఆసక్తికర మలుపులతో తొలిభాగం ఆహ్లాదకరంగా సాగింది.
ఆర్3 గ్యాంగ్ అరచకాలు ఆకట్టుకొన్నాయి. స్నేహితుల గ్యాంగ్ మాట్లాడుకొనే బూతులని సెన్సార్ లేకుండా చూపించాడు. సెకాంఢాఫ్ లో సినిమా కాస్త స్లోగా సాగిన ఎక్కడా కామెడీ మిస్ కాలేదు. ప్రేక్షకుడు హాయిగా నవ్వుకొనేలా సినిమాని నడిపించాడు.
ఈ కథకి నటీనటులని ఎంచుకోవడంలోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ అద్భుతంగా నటించారు. నివేదా అందంగా కనిపించింది. తన మార్క్ నటనతో ఆకట్టుకొంది. నివేదా పేతురాజు గ్లామర్ గా కనిపించింది. స్టార్ హీరోయిన్ గా ఒదిగిపోయింది. బిత్తిరి సత్తి పాత్ర బాగుంది. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.
సాంకేతికంగా :
సస్పెన్స్ సన్నివేశాలు ప్రేక్షకుడిని ఉత్కంఠకి గురిచేస్తాయి. ఇందులో మాత్రం సస్పెన్స్ సన్నివేశాల్లోనూ నవ్వితెప్పిస్తాయి. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభ కనబడింది. వివేక్ సాగర్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : సంక్రాంతి సినిమా ‘ఎఫ్2’ ప్రేక్షకులని బాగా నవ్వించింది. సూపర్ హిట్ అయింది. ఎఫ్ 2 తర్వాత ప్రేక్షకులని ఆ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసిన సినిమా ‘బ్రోచేదెవరురా’ నిలవనుంది.
రేటింగ్ : 3.5/5