జులైలో ‘నాని సింహ గర్జన’


1994లో చిన్నా పెద్దా అందరినీ అలరించిన యానిమేషన్‌ చిత్రం ‘ది లయన్‌ కింగ్’‌. ఇప్పుడు సరికొత్త హంగులతో మరోసారిప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సింబా పాత్రకు తెలుగులో నాని గొంతు అరువిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని ట్విట్ చేశారు. ‘ఈ యేడాది తండ్రిగా కనిపించాను. ఇప్పుడు తనయుడిగా కనిపించబోతున్నా. నా కొత్త పేరు సింబా. జులై వస్తున్నా’నని ట్విట్ చేశారు.

‘ది జంగిల్‌ బుక్‌’, ‘ఐరన్‌మ్యాన్‌’ చిత్రాల దర్శకుడు జాన్‌ ఫేవరోవ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వాల్‌ డిస్నీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న చిత్రమిది. సింబా తండ్రి పాత్ర ముఫాసాకు రవిశంకర్‌, ప్రతినాయక పాత్ర స్కార్‌ జగపతిబాబు, ‘పుంబా’ అనే అడివి పందికి బ్రహ్మానందం, ‘టిమోన్‌’ అనే ముంగిసకి ఆలీ డబ్బింగ్‌ చెప్పారు. ఇక హిందీలో ముఫాసా పాత్రకు షారుఖ్‌, సింబా పాత్రకు ఆయన తనయుడు ఆర్యన్‌ గొంతు అరువిచ్చారు. ‘లయన్‌ కింగ్‌’ హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.