‘రణరంగం’ టీజర్ టాక్

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘రణరంగం’. కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరో హీరోయిన్లు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఒక గ్యాంగ్‌స్టర్‌ జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు టీజర్ తో అర్థమవుతోంది.

మొదటి ప్రజెంట్ ఏపీసోడ్ చూపించారు. దట్టమైన అడవి మధ్యలో ఓ ఫాం హౌస్ లో ఓ హత్య తో టీజర్ మొదలైంది. ‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్ఘ్యం కవాలి’ డైలాగ్ బాగా పేలింది. అయినా వాళ్లేవరూ.. దేవాని ఎందుకు చంపాలనుకొంటున్నారని కాజల్ అనడం చూడొచ్చు. ఆ వెంటనే శర్వా గ్యాంగ్ తో వచ్చే బిట్ సీన్, కల్యాణ్ ప్రిదర్శినితో బస్ లో ఓ రొమాంటిక్ సీన్ చూపించారు. ఆ వెంటనే కథని 1990లోకి తీసుకెళ్లారు. ‘కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్తితుల్లో మనం ఉండకూడదు’ అని శర్వా చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ నిలిచింది.

టీజర్ లో యాక్షన్, డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయ్. ప్రజెంట్ ఏపీసోడ్ లో గన్స్, 1990 వచ్చే సీన్స్ లో కత్తులని వాడారు. మాస్ లుక్ లో శర్వా నటన అదిరిపోయింది. ఆగస్టులో రణరంగం ని థియేటర్స్ లో చూడొచ్చు.