రేణు రెండో పెళ్లికి పవన్ సపోర్టు.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయం ఈ మధ్య హాట్ టాపిక్’గా మారిన సంగతి తెలిసిందే. వదినమ్మా రెండో పెళ్లి వద్దమ్మా.. అంటూ పవన్ అభిమానులు చేసిన విజ్ఝప్తులు సోషల్ మీడియాలో వైరల్’గా మారాయి. రేణు రెండో పెళ్లి విషయంలో పవన్ అభిమానుల నుంచి అభ్యంతరం వ్యక్తం అయినా.. పవన్ మాత్రం ఆమెను సపోర్టు చేసినట్టు తెలుస్తోంది.

విడాకులు తీసుకొన్న పవన్-రేణు గొడవ ఎప్పుడు రచ్చకెక్కలేదు. ఇప్పటికీ మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. అయితే, రెండో పెళ్లి విషయంలో తనకు పవన్ విలువైన సూచనలు చేశాడని రేణు తెలిపింది. ఇటీవలే ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు పవన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఇటీవలే పవన్ కు కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కి పోన్ చేశా. రెండో పెళ్లి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించు. ముందు అతడి నేపథ్యం, మంచి వాడా ? కాదా ? అనే విషయాలు తెలుసుకోమని తెలిపాడట.

ఇక, అందరు అనుకొంటున్న విడిపోయినందుకు పవన్ రేణు దేశాయ్ పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడన్న విషయంలో ఏమాత్ర నిజంలేదట. పిల్లల కోసం ఓ పవన్ ఓ ఇల్లు ఇచ్చాడు. దాన్ని అమ్మి పిల్లల కోసం ఇన్వెస్ట్ చేశా. భవిష్యత్ లో వారి చదువుల కోసం వాటిని ఖర్చు పెడతానని రేణు చెప్పుకొచ్చింది. మొత్తానికి.. రేణు దేవుడు అని చెప్పుకొచ్చిన రేణు.. ఆ దేవుడికి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాలని మాత్రం ఎప్పటిలాగే చెప్పలేదు.