రోహిత్‌ శతకం వృథా


ప్రపంచకప్ లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సెమీస్‌ ఆశలు ప్రమాదంలో పడ్డ స్థితిలో ఇంగ్లిష్‌ జట్టు గొప్ప పట్టుదలతో, ప్రణాళికతో ఆడి.. కోహ్లీసేన జైత్రయాత్రకు చెక్‌ పెట్టింది. భారత్‌ 31 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. జానీ బెయిర్‌స్టో (111; 109 బంతుల్లో 10×4, 6×6), బెన్‌ స్టోక్స్‌ (79; 54 బంతుల్లో 6×4, 3×6), జేసన్‌ రాయ్‌ (66; 57 బంతుల్లో 7×4, 2×6) మెరుపులతో ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. షమి (5/69) వికెట్లు పడగొట్టాడు.

338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 5 వికెట్లకు 306 పరుగులే చేయగలిగింది. రోహిత్‌ శర్మ (102; 109 బంతుల్లో 15×4) సెంచరీ వృథా అయింది. కోహ్లి (66; 76 బంతుల్లో 7×4), పాండ్య (45; 33 బంతుల్లో 4×4)ల పోరాటం సరిపోలేదు. ప్లంకెట్‌ (3/55), వోక్స్‌ (2/58) భారత్‌ను దెబ్బ తీశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు సెమీస్ అవకాశాలని మెరుగుపరుచుకుంది.