ట్రైలర్ టాక్ : దొరసాని


విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘దొరసాని’. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్. ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 12 ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

రేపే నీ ఇడుదల కదా. నిద్రపడతలేదా ఏందీ ? ఓ వ్యక్త అడగగా.. లోపలికొచ్చి శాన యేళ్లు అయింది కదా. అవును నిన్ననా ఇయాలనా ? 30యేళ్లు అయిపాయె అనే సమాధానంతో ట్రైలర్ మొదలైంది. రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ తో ట్రైలర్ ని ఆసక్తిగా
కట్ చేశారు. చివర్లో ‘ఉద్యమంలో చావు కూడా ఓ విజయం. మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’ అనే సంభాషణ హైలైట్ గా నిలిచింది. పెళ్లి చూపులు నిర్మాత యష్ రాగినేని – మధుర శ్రీధర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.