పీకల్లోతు అప్పుల్లో పవన్ హీరోయిన్
‘బద్రి’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు జంటగా నటించింది బాలీవుడ్ హీరోయిని అమీషా పటేల్. ఇప్పుడీ హీరోయిన్ పీకల్లోతు అప్పుల్లో ఉన్నట్టు సమాచారమ్. హీరోయిన్ గా అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న అమీషా, సోషల్ మీడియాతో పాటు ఫొటోషూట్స్ తో వస్తున్న సంపాదనతో బండి లాగించేస్తోంది. ఇలాంటి సమయంలో ధైర్ఘ్యం చేసి.. ఓ సినిమాకు నిర్మాత మారింది. దీనికోసం అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర 3 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఆ సినిమా కోసం తీసుకొన్న రూ. 3కోట్ల అప్పుని ఇంకా తీర్చలేదు. సదరు ఫైనాన్షియర్ ఒత్తిడి చేయడంతో అతడికి చెల్లని చెక్కు ఇచ్చింది. ఇప్పుడా ఫైనాన్షియర్ అమీషాపై కేసు వేశాడు. రాంచీ కోర్టులో కేసు ఫైల్ అయింది. ఈనెల 8న ఆమె కోర్టుకు హాజరుకావాలి. హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ జారీచేస్తారు. ప్రారంభించిన సినిమా సెట్స్ పైకి రాక, అప్పు తీర్చలేక ప్రస్తుతం సతమతమౌతోంది అమీషా పటేల్. ఈ ఆర్థిక కష్టాల నుంచి అమీషా ఎలా బయటపడుతుంది? అనేది చూడాలి.