ఈ వయసులో.. ఆ సమస్య ఏంటీ అఖిల్ ?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఓ 50 యేళ్ల తర్వాత రావాల్సిన సమస్య అది. అఖిల్ కి ఇప్పుడే వచ్చేసింది. అదే హీరోయిన్ సమస్య. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. లకి హీరోయిన్స్ దొరకడం కష్టంగా మారిన సంగతి తెలిసిందే. ముదురు హీరోయిన్స్ ని తీసుకొంటే ప్రేక్షకులకి రుచించదు. యంగ్ హీరోయిన్స్ ఏమో.. సీనియర్ హీరోలతో రొమాన్స్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. వారితో రొమాన్స్ చేస్తే యంగ్ హీరోలు తమవైపు చూడరని వారి భయం.
దాదాపు ఇలాంటి సమస్యని అఖిల్ ఎదుర్కొంటున్నారు. ఆయనకి మొదటి నుంచి హీరోయిన్స్ సమస్య ఉంది. అఖిల్ చేసిన మూడే మూడు సినిమాలు. వీటిలో రెండు సినిమాల్లోనూ కొత్త హీరోయిన్స్ నే నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాల్గో సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఇప్పటికే సినిమా ప్రారంభం అయింది. సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉంది. ఐతే, హీరోయిన్ దొరక్క ఆలస్యం అవుతుంది. కొత్త హీరోయిన్ కాకుండా.. కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ కోసం చూస్తున్నారు
క్రేజ్ హీరోయిన్స్ అఖిల్ తో రొమాన్స్ చేసేందుకు ఒప్పుకొంటారా ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ? అఖిల్ అందంగా ఉన్నా.. ఇంకా హిట్ పడలేదు. ఆయన మార్కెట్ ఏంటన్నది తెలీదు. ఈ నేపథ్యంలోనే అఖిల్ కోసం రష్మిక మందనని అనుకొన్నా.. ఆమె ఓకే చెబుతుందా ? లేదా ?? అన్నది అనుమానంగా మారింది. మొత్తానికి అఖిల్ చిన్న వయసులోనే హీరోయిన్ సమస్యను ఎదుర్కొంటుండం విశేషం. అఖిల్ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్ లో ఆయనకి అమ్మాయి దొరకడం కష్టమే మరీ.. !