‘రాక్షసుడు’ నగిలిపోయేలా ఉన్నాడు
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘రాక్షసుడు’గా మారిన సంగతి తెలిసిందే. తమిళ్ ‘రాట్ససన్’ కు రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ సినిమా రెడీ అయిపోయింది. కానీ సరైన డేట్ కోసం నిరీక్షిస్తోంది. వాస్తవానికి జులై 19న రిలీజ్ ఫిక్సయింది. ఇంతలో జులై12నే రావాల్సిన ‘ఇస్మార్ట్ శంకర్’ జులై19కి వచ్చేశాడు.
ఈ నేపథ్యంలో ‘రాక్షసుడు’ రిలీజ్ డేటు మార్చక తప్పలేదు. ఏకంగా ఆగస్టు 2 వెళ్లాడు రాక్షసుడు. అదేరోజు శర్వానంద్ ‘రణరంగం’ రిలీజ్ కానుంది. రామ్ కంటే శర్వా డేంజర్. ఆయన సినిమాల కోసం ప్రత్యేకంగా వెయిట్ చేసే ప్రేక్షకవర్గం ఉంది. యూత్, ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ శర్వా సినిమాలని ఇష్టపడతారు. అలాంటి శర్వాతోనే బెల్లకొండ పోటీకి దిగాడు. ఎలా తట్టుకొంటానేది చూడాలి. ఒకవేళ రణరంగం వాయిదాపడితే మాత్రం రాక్షసుడు బతికిపోయినట్టే. లేదంటే నలిగిపోయినట్టే.