‘కల్కీ’ సెలబ్రేషన్స్ చూశారా ?

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. గతవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. దీంతో చిత్రబృందం ఆనందంలో మునిగి తేలుతోంది.

ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి హీరో రాజశేఖర్‌ తనదైన శైలిలో స్టెప్‌లు వేస్తూ సందడి చేశారు. ఆయన కుమార్తెలు కూడా చిత్ర బృందంతో కలిసి చిందులేశారు. అదా శర్మ, ప్రశాంత్‌ వర్మ డోలు వాయిస్తూ సందడి చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.