ఏపీ అసెంబ్లీకి సింగపూర్ మంత్రి?
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఏపీకి చేరకున్నారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీని ఏపీ ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ చూపించారు. ఆతరువాత తాత్కాలిక సెక్రటేరియట్ కు తీసుకువెళ్లి చూపించారు. అమరావతి నిర్మాణంపై ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ. ఈ కమిటి అమరావతిలో సమావేశమైంది.
సమావేశానికి సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, మంత్రులు నారాయణ, యనమల, సీఆర్డీఏ, సింగపూర్ అధికారులు పాల్గొన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో అమరావతిలో స్టార్ట్ అప్ ఏరియా అభివృద్ధి చేస్తోంది సింగపూర్. ఈ విషయంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా.. ముందు ముందు తలెత్తే సమస్యలున్నాయా అనేదానిపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు వెల్లడించనున్నారు.