అమీర్‌పేటలో 20 కోచింగ్‌ సెంటర్లు సీజ్‌


హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న 20 ఐటీ శిక్షణా సంస్థల్ని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సీజ్‌ చేశారు. అగ్ని ప్రమాద, విపత్తులను ఎదుర్కొనేందుకు ఎటువంటి భద్రతా చర్యలూ చేపట్టని కారణంగా ఈ చర్యలు తీసుకొన్నారు.

గతంలో సూరత్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 23మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు నెలల కిందట నగరంలోని అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, అశోక్‌నగర్‌లో 671 కోచింగ్‌ సెంటర్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నోటీసులపై స్పందించిని 20 కోచింగ్ సెంటర్లని బుధవారం సీజ్ చేశారు.

ప్రముఖ ఐటీ శిక్షణ సంస్థలైన ఎస్‌ఎస్‌ ల్యాబ్స్‌, ఇండెక్స్‌ ఐటీ టెక్నాలజీ, సన్‌స్క్రీన్‌ ‌టెక్నాలజీ, సత్య ఐటీ సొల్యూషన్స్‌, క్యాపిటల్‌ ఐటీ టెక్నాలజీ, ఇమాక్స్‌ టెక్నాలజీ, అవని టెక్నాలజీ, హర్ష టెక్నాలజీ, జేపీఎస్‌ టెక్నాలజీ, ఐనెట్‌ తదితర సంస్థలను సీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ తెలిపారు.