గెలుపుతో ముగించారు
ప్రపంచకప్ లో వెస్టీండీస్ జట్టు గెలుపుతో ఆరంభించింది. గెలుపుతోనే ముగించింది. గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో విండీస్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో.. విండీస్ ఆడిన తొలిమ్యాచ్ (పాకిస్థాన్), ఆఖరి(అఫ్గానిస్థాన్) మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించినట్టయింది. మిగతా 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
ఇక అఫ్గాన్ తో మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. షై హోప్(77; 92బంతుల్లో 6×4, 2×6), లూయిస్(58; 78బంతుల్లో 6×4, 2×6) , పూరన్(58; 43 బంతుల్లో 6×4, 1×6), హోల్డర్(45; 34బంతుల్లో 1×4, 4×6) రాణించారు. అనంతరం అఫ్గానిస్థాన్ పోరాటం 50 ఓవర్లలో 288 పరుగుల వద్దే ముగిసింది. ఇక్రమ్(86; 93బంతుల్లో 8×4), రహమత్(62; 78బంతుల్లో 10×4)ల పోరాటం వృథా అయింది.