కొత్త నాణేలు రాబోతున్నాయ్

త్వరలో కొత్త నాణేలు రాబోతున్నాయి. కొత్త రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఈ నాణేలను అంధులు కూడా గుర్తించే విధంగా రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

పెద్ద నోట్లు రద్దు తర్వాత ఆర్బీఐ రూ. 500, రూ. 200, రూ. 100, రూ.50 కొత్త నోట్లని ముద్రించింది. ప్రస్తుతం కొన్ని చోట్ల రూ. 10 నాణంని తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో.. కొత్త రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను ఆర్బీఐ తీసుకురానుండటం విశేషం.