‘గాంధీపీడియా’ రాబోతుంది
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్రం గొప్ప నివాళి ప్లాన్ చేసింది. వికీపీడియా తరహాలో ‘గాంధీపీడియా’ను ప్రారంభించనుంది. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
గాంధీపీడియా ద్వారా మహాత్ముని విలువలు, బోధనలను ప్రచారం చేసే ప్రయత్నం చేయనున్నారు. పార్లమెంటులో గురువారం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్ సైతం గాంధీని స్మరించుకున్నారు. గాంధీ బోధనల ఆధారంగానే సర్వే జరిగిందన్నారు. ‘‘మీరు చేపట్టే ఏ చర్యలకు ముందైనా అవి పేద ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడతాయో ఒక్కసారి ఆలోచించండి’’ అన్న గాంధీ బోధనల ఆధారంగా సర్వే సాగిందని వెల్లడించారు.