రివ్యూ : బుర్రకథ

చిత్రం : బుర్రకథ (2019)

నటీనటులు : ఆది సాయి కుమార్, మిష్తి చక్రవర్తి, నైరా షా తదితరులు

సంగీతం : సాయి కార్తీక్

దర్శకత్వం : డైమాండ్ రత్నబాబు

నిర్మాత : హెచ్‌కె శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవీ కిరణ్ రెడ్డి

రిలీజ్ డేటు : 5జులై, 2019

రేటింగ్ : 2.5/5

ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో ఆది సాయి కుమార్‌ నటించిన చిత్రం ‘బుర్రకథ’. మిస్త్రీ చక్రవర్తి, నైరా షా కథానాయికలు. ఒకే బుర్ర‌లో ఇద్ద‌రు మ‌నుషులుంటే కాన్సెప్ట్ తో ‘బుర్రకథ’ తెరకెక్కింది. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన బుర్రకథ ఎలా ఉంది? ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

అభి మరియు రామ్ రెండు బుర్రలు కలిగిన ఒకే వ్యక్తి. అభి మాస్. రామ్ క్లాస్. హ్యాపీతో లవ్ లో పడిన అభి జీవితం ఎలా సాగింది ? ఒకే మనిషిలో రెండు బుర్రల కారణంగా ఎదురైన సమస్యలేంటీ ? అనేది బుర్రకథ కథ.

ప్లస్ పాయింట్స్ :

* కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్ :

* కథనం

* క్లైమాక్స్

* విలన్ ట్రాక్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

ఆది సాయి కుమార్ కెరీర్ ప్రారంభంలో హిట్స్ కొట్టాడు. ఆ తర్వాతే.. ఆయన్ని వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయ్. వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాదాసీదా కథలు.. సాదాసీదా నటనతో బండిలాగించేస్తున్నాడు. ఆయన తాజా చిత్రం బుర్రకథ. అభి, రామ్ గా రెండు షేడ్స్ లో ఆది బాగానే నటించాడు. కానీ, అద్భుతం చేయలేదు. దీంతో.. బుర్రకథ ఆదికి స్పెషల్ గా నిలిచేలా కనిపించడం లేదు.

‘భలే భలే మగాడివోయ్’ సినిమా స్పూర్తిగా బుర్రకథ రాసుకొన్నట్టు అనిపించింది. భలే భలే మగాడివోయ్ లో మతిమరుపు కాన్సెప్ట్ ని వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు మారుతి. బుర్రకథ కూడా ఇలాంటి లైన్ నే. ఇందులో ఒకే వ్యక్తిలో రెండు బుర్రలు ఉన్నట్టుగా చూపించారు. ఐతే, కథని గ్రిప్పింగ్ గా చెప్పలేకపోయాడు. సినిమాలో కమర్షియల్ అప్రోచ్ కనిపించింది. spoof, సటైర్స్, కామెడీ సీన్స్ ని బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఫర్వాలేదనిపించింది. సినిమా మొత్తం ఒకే మూడులో నడించింది.
ఐతే, ఉత్కంఠని కలిగించే సన్నివేశాలు లేవు. తర్వాత ఏం జరగబోతుందన్నది ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి.

హీరోయిన్ మిస్త్రీ చక్రవర్తి అందంగా కనిపించింది. నటనతోనూ ఆకట్టుకొంది. మరో హీరోయిన్ నైరా షా నటన బాగుంది. గ్లామర్ తో ఆకట్టుకొంది. రాజేంద్ర ప్రసాద్, పోసాని తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

సాయి కార్తీక్ అందించిన పాటలు సాదాసీదాగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.25/5

బాటమ్ లైన్ : బోరింగ్ బుర్రకథ