మంగళగిరిపై లోకేష్ ఫోకస్


ఓడిన చోట వెతుక్కొనే పనిలో పడ్డాడు చినబాబు లోకేష్. ఎమ్మెల్యేగా గెలవకుండానే ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా పని చేశారు లోకేష్. ఏపీ ఐటీశాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐతే, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు. మంగళగిరి తెదేపా అభ్యర్థిగా పోటీ చేశారు. వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇప్పుడు లోకేష్ సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది. శుక్రవారం మంగళగిరి తెదేపా కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ సమావేశమయ్యారు. నియోకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చెయ్యడానికి, ప్రతి మండలంలోనూ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందరిని కలుపుకొనిపోయి పార్టీని నియోకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని లోకేష్ అన్నారు. ఇప్పటి నుంచి కష్టపడితేగానీ.. వచ్చే ఎన్నికల్లో గెలవలేనని లోకేష్ త్వరగానే గ్రహించినట్టు కనిపిస్తోంది.