బడ్జెట్‌ ఎఫెక్ట్ : పెరిగేవి.. తగ్గేవి ఇవే !


కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్‌ వివిధ వస్తువుల ధరలపై ప్రభావ చూపనుంది. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులపై ఓ లుక్కేద్దాం.

ధరలు పెరిగే వస్తువుల లిస్టు :

* పెట్రోల్‌, డీజిల్‌

* బంగారం

* సీసీ కెమెరాలు

* ఏసీలు

* స్టోన్‌ క్రషింగ్‌ ప్లాంట్‌లు

* స్పీకర్లు

* డిజిటల్‌ వీడియో రికార్డర్లు

* ఆటో మొబైల్‌లో వినియోగించే

* షీట్లు, రోల్స్‌, డిస్క్‌లు, ప్యాడ్‌లు

* కార్ల అద్దాలు, రేర్‌ వ్యూ గ్లాస్‌

* మోటార్‌ బైక్‌లకు వేసే తాళాలు

* ఆయిల్‌/ఎయిర్‌ ఫిల్టర్‌లు

* బైక్‌ హార్న్‌లు

* లైటింగ్‌ సిస్టమ్‌

* కార్ల విండో స్క్రీన్‌ వైపర్‌

* సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్తు నిధి పన్ను

* జీడి పిక్కలు

* సబ్బులు

* ప్లాస్టిక్‌ ఫ్లోర్‌ కవర్లు

* రబ్బరు

* టైర్లు

* అలాయ్‌ స్టీల్‌ వైర్‌

* మెటల్‌ ఫర్నిచర్‌

* పీవీసీ పైపులు

* న్యూస్‌ ప్రింట్‌

* మ్యాగజైన్లు

* దిగుమతి చేసుకునే పుస్తకాలు

* ఆప్టికల్ ఫైబర్‌ కేబుళ్లు

* సిరామిక్‌ టైల్స్‌

* స్టెయిన్‌లెస్‌ స్టీల్‌

ధరలు తగ్గే వస్తువుల లిస్టు :

* రక్షణ సామగ్రి

* గృహ రుణాలు

* నాఫ్తా

* సెల్‌ఫోన్‌ ఛార్జర్లు

* సెట్‌టాప్‌ బాక్సులు

* మొబైల్‌ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు

* ఎలక్ట్రిక్‌ కారులు, బైక్‌లు, ఛార్జింగ్‌ సైకిళ్లు