తెలంగాణ ఆదర్శంగా కేంద్ర ప్రథకాలు
కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిన సంగతి తెలిసిందే. ‘పిఎం కిసాన్’ పేరుతో ప్రతి రైతు ఖాతాలో యేడాది రూ. 6000లు జమచేస్తోంది. అదీకూడా మూడు విడతలుగా. ఇప్పుడు
మిషన్ భగీరథ పథకాన్ని ‘Har Ghar Jal Yojana’గా తీసుకొచ్చింది. శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెరాస నేతలు, తెలంగాణ ప్రజలు ఖుషి అవుతుండ్రు.
దేశానికే కేసీఆర్ దిక్సూచి అయ్యారు. మన పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని సంబరపడిపోతున్నారు. కేంద్ర బడ్జెట్-2019పై జాతీయ ఛానెల్స్ చేపట్టిన చర్చా వేదికల్లోనూ రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనియాడటం విశేషం. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీకొడుతుందని విశ్లేషించడం జరిగింది.