ఆ ఊపుడుకు 10మిలియన్ వ్యూస్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా ప్రచార వీడియోలకి వచ్చే రెస్పాన్స్ ని చూస్తే.. సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమవుతోంది. ‘సాహో’ టీజర్ మరో భారతీయ సినిమా దక్కని డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైన 24గంటల్లోనే 54మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకొంది. మొత్తంగా 60మిలియన్ వ్యూస్ దాటేశాయి. అంతేకాదు సాహో హిందీ టీజర్ 933కె లైక్స్ వచ్చాయి. మరో బాలీవుడ్ సినిమా టీజర్ కు కూడా ఇన్ని లైక్స్ రాలేదు.

ఇక, శుక్రవారం విడుదలైన సాహో ఫస్ట్ సాంగ్ టీజర్ #PsychoSaiyaanTease దుమ్ములేపేస్తోంది. ఈ సాంగ్ టీజర్ విడుదలైన 24గంటల్లోనే 10మిలియన్స్ పై వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ సాంగ్ టీజర్ లో శ్రద్దా కపూర్ డ్యాన్స్ నే హైలైట్. ఆమెకు ప్రభాస్ జస్ట్ కంపెనీ ఇచ్చినట్టు అనిపించింది. దానికి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం సాహో చిత్రబృందానికి ఆనందం కలిగించే విషయమే. ట్రైలర్, మిగతా పాటలు విడుదలైతే సాహో ఫీవర్ పీక్స్ చేరడం ఖాయం. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.