13 వికెట్స్ డౌన్.. స్వామి ప్రభుత్వం కూలినట్టే !
కుమారస్వామి ప్రభుత్వానికి డెత్ షాక్. కర్ణాటక రాజకీయాలు సంక్షోభం దిశగా సాగుతున్నాయి. జేడీ(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఆఖరి రోజులు వచ్చేశాయి. ఇటీవలే కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అధికార కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేందుకు రెడీ అయ్యారు. వీరిలో 8మంది ఈరోజే తమ రాజీనామా లేఖలని స్వీకర్ కు సమర్పించబోతున్నట్టు సమాచారమ్.
కర్ణాటక సీఎం కుమారస్వామి అమెరికాలో ఉన్నారు. ఆయన ఆదివారం తిరిగి బెంగళూరు చేరుకోనున్నారు. ఆ లోపే జేడీ(ఎస్) ప్రభుత్వం కూలిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలుండగా, కాంగ్రెస్కు 78, జేడీఎస్ 36, బీజేపీకి 105, బీఎస్పీకి 1 ఉన్నారు.
కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 114, ఒకరు బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రలతో కలిసి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్-జేడీయే కూటమి బలం 100కి పడిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఐతే, కాంగ్రెస్, జేడీ ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలని బీజేపీ లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా ? లేదంటే.. ?? మళ్లీ మధ్యంతర ఎన్నికలు వస్తాయా ? అన్నది ఆసక్తిగా మారింది.