రిటైర్మెంట్‌’పై ధోని రియాక్షన్

టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ పై విస్తృత చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ లో ధోని ఆటతీరుయే ఈ చర్చకు దారితీసింది. మునుపటిలా ధోని వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. అఫ్గాన్‌, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అతడి బ్యాటింగ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచకప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

శనివారం శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ధోని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్‌ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ‘క్రికెట్‌ నుంచి ఎప్పుడు తప్పుకుంటానో నాకు తెలియదు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే నేను రిటైర్‌ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు’ అని ధోనీ అన్నారు. ఒకవేళ జులై 14న టీమిండియా విశ్వవిజేతగా నిలిస్తే ధోనీకి అదే రోజున రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.