రూ.8,750 కోట్లతో రైతు భరోసా


రాజన్న రాజ్యం మళ్లీ వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తిగా పాలన కొనసాగిస్తున్నారు. రైతులు, విద్యార్థులు, పేద ప్రజలని దృష్టిలో ఉంచుకొని సరికొత్త పథకాలని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

వైఎస్ పుట్టినరోజుని (జులై8) ‘రైతు దినోత్సవం’గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం… రైతు భరోసా కింద రూ.8,750 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం జగన్ రైతులకి బహిరంగ లేఖ రాశారు. వైఎస్ఆర్ పుట్టినరోజుని రైతు దినోత్సవంగా జరిపించాలని.. తన పాదయాత్రలో ప్రజలు కోరారు. వారి కోరిక మేరకు ‘రైతు భరోసా పథకం’ కింద 54 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.8750 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు.