తెలంగాణకు రూ.450 కోట్ల కేంద్ర నిధులు విడుదుల
కేంద్ర ప్రభుత్వం దేశంలోని 10 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ క్రింద నిధులు విడుదల చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,239 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా త్రిపురకు రూ.1858.70 కోట్లు విడుదల చేసింది. బిహార్‌కు రూ.739 కోట్లు, ఏపీకి రూ.15.81 కోట్లు, తెలంగాణకు రూ.450 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు.
వివిధ ప్రాజెక్టుల కోసం జమ్మూకశ్మీర్‌కు రూ.285 కోట్లు, నాగాలాండ్‌కు రూ.226 కోట్లు, రాజస్థాన్‌కు రూ.146 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.8 కోట్లు విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన అర్ధకుంభమేళా పనుల కోసం రూ.1,200 కోట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం రూ.309 కోట్లు ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.641,39,52,000 నిధులను కేంద్రం విడుదల చేసింది.