మహేష్ అభిమానులూ.. ఈసారి టెన్షన్ ఫ్రీ !


సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి కొత్త సినిమా వస్తుందంటే.. ఆ కిక్కే వేరు. మహేష్ కొత్త సినిమా టైటిల్ ఏంటీ ? సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది ?? ఫస్ట్ లుక్ ఎప్పుడుస్తుంది ??? అనే టెన్షన్స్ అభిమానులకి ఉండేది. ఐతే, మహేష్26 ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో ఎలాంటి సస్పెన్స్, టెన్షన్స్ లేకుండా పోయాయి. సినిమా ప్రారంభోత్సోవానికి ముందే టైటిల్ ప్రకటించారు. సినిమాలో మహేష్ జవాన్ గా కనిపిస్తారని చెప్పేశారు. రిలీజ్ డేటు కూడా ముందే ప్రకటించారు. 2020 సంక్రాంతి రిలీజ్ చెప్పేశారు. దీంతో మహేష్ అభిమానులు టెన్షన్ ఫ్రీ అయ్యారు.

ఇక, మహేష్ లుక్ విషయంలోనూ టెన్షన్ పడే పరిస్థితి తగ్గింది. ఇటీవలే కశ్మీర్ లో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రారంభం అయింది. అక్కడ మహేష్ జవాన్ కనిపించే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్ నుంచి మహేష్ జవాన్ లుక్ లో ఉన్న ఫోటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఐతే, ఇలాగే లీకులు కొనసాగితే.. మహేష్ సినిమాకు డ్యామేజ్ తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. దాదాపు రూ. 100కోట్లకి పైగ బడ్జెట్ తో మహేష్26 సినిమా తెరకెక్కుతోంది. అలాంటి సినిమా విశేషాలు ముందే లీకైతే డ్యామేజ్ పెద్దదిగా ఉండే ఛాన్సుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కుతోంది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 13 యేళ్ల తర్వాత ఆమె రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర్, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.