కంగనాకు హృతిక్ హెచ్చరికలు


ప్రేమ వికటిస్తే కలిగేది శతృత్వమే. కంగ‌నా ర‌నౌత్-హృతిక్ రోషన్ ల మధ్య అదే జరిగింది. ఈ జంట కొన్నాళ్లు ప్రేమలో మునిగితేలింది. సహజీవనం చేసింది. ఆ తర్వాతే తేడా కొట్టింది. బద్ద శత్రువులుగా మారారు. ఒకరిపై మరొకరు ఓ రేంజ్ లో ఆరోపణలు చేసుకొన్నారు. కేసులు పెట్టుకొన్నారు. కోర్టుకు వెళ్లారు. వీరి పంచాయతీని పరిష్కరించలేక కోర్టు కూడా చేతులెత్తేసింది. ఆరేళ్లుగా వీరి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఐతే, ఇప్పటికే బాలీవుడ్ లో కంగనా-హృతిక్ ల వార్ ట్రెండింగ్ టాపిక్ నే.

సమయం దొరికినప్పుడల్లా.. కంగనా, ఆమె సోదరి రంగోలీ హృతిక్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు. హృతిక్ మాత్రం తిరిగి ఎటాక్ చేయలేదు. ఇకపై తన నుంచి రియాక్షన్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు హృతిక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హృతిక్ కంగనాతో వివాదంపై మనసు విప్పి మాట్లాడారు. “అవ‌త‌లివారు గొడ‌వ‌కు దిగినా నేను వివాదాల‌కు దూరంగా ఉండేందుకే ప్ర‌య‌త్నిస్తున్నా. గొడ‌వ‌కు దిగ‌డాన్ని ఎంజాయ్ చేసేవారికి నేను ఇక‌పై అవ‌కాశం ఇవ్వ‌ద‌ల‌చుకోలేదు. ఆరేళ్లుగా ఈ స‌ర్క‌స్‌ని కొన‌సాగిస్తూనే ఉన్నారు. భార‌త్‌లో ఓ యువ‌కుడు మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేక‌రంగా చ‌ట్ట‌బ‌ద్ధంగా పోరాడ‌డం అనే దానికి ముగింపు ఉండ‌దు. అది ఎప్ప‌టికీ కొనసాగుతూనే ఉంటుంద‌”న్నారు.

ఇక, హృతిక్ సూపర్ 30, కంగనా ‘మెంటల్ హై క్యా’ సినిమాలు జులై 26న విడుదల తేదిని ప్రకటించుకొన్నాయి. ఈ నేపథ్యంలో హృతిక్, కంగనాల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఫైనల్ గా జులై 26 నుంచి హృతిక్ ముందుకు జరిగారు. సూపర్ 30 సినిమాని రెండు వారాల ముందుగా అనగా జులై 12కి ఫిక్స్ చేశారు.