బిగ్ బాస్3 : నాగ్ పారితోషికం.. తారక్ కి డబుల్ !


బిగ్ బాస్ తెలుగు సీజన్-3కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో కోసం నాగ్ తీసుకొంటున్న పారితోషికంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బిగ్ బాస్ సీజన్1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సమయంలో తారక్ రెమ్యూనరేషన్ పై వాడివేడి చర్చసాగింది. తారక్ కి రూ.6కోట్లకిపైగా రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలిసింది. ఇక, సీజన్ 2కోసం హోస్ట్ గా వ్యవహరించిన నేచురల్ స్టార్ నానికి కాస్త తక్కువగా రూ. 4కోట్ల వరకు ముట్టాయట. ఐతే, ఇప్పుడు సీజన్3 కోసం నాగ్ రెమ్యూనరేష్ వింటే షాక్ కావాల్సిందే.

నాగ్ ఏకంగా రూ. 12కోట్లకిపైగా రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడట. ఇది తారక్ తీసుకొన్న రెమ్యూనరేషన్ కి డబుల్. వెండితెరపై నాగ్ కంటే తారక్ కే క్రేజ్ ఎక్కువ. ఐతే, బుల్లితెరపై వరకు వచ్చేసరికి నాగ్ తారక్ ని దాటేశాడు. ‘మీలో కోటీశ్వరుడు ఎవరు’ షోని సక్సెస్ ఫుల్ గా నడిపిన అనుభవం నాగ్ కు ఉంది. ఈ నేపథ్యంలోనే నాగ్ కు రూ. 12కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన బిగ్ బాస్3 ప్రోమోలు ఆకట్టుకొంటున్నాయి. త్వరలోనే బిగ్ బాస్ 3 ప్రారంభం కానుంది. ఇక 100రోజులు పండగే.