బ్యాడ్ న్యూస్ : ఆటకు వర్షం అడ్డంకి
రసవత్తరంగా మారుతున్న ‘భారత్ వర్సెస్ న్యూజిలాండ్’ సెమీస్ మ్యాచ్ కు వర్షం అడ్డం పడింది. వర్షం కారణంగా
మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భువనేశ్వర్ 46.1వ బంతి వేసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేశారు. ఎక్కువ తేమ ఉండటంతో కవర్లు కప్పాలని మైదానం సిబ్బందికి సూచించారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ 211/5తో ఉంది. రాస్ టేలర్ (67; 85 బంతుల్లో 3×4, 1×6), టామ్ లేథమ్ (3; 4 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. కివీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఇంకా 23 బంతులే ఉన్నాయి. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఆట నిలిపివేయక తప్పలేదు. ఇక, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. రిజర్వ్ డే ఉంది. రేపు మళ్లీ మ్యాచ్ ని నిర్వహిస్తారు. రేపు కూడా వర్షం అడ్డుపడితే.. రన్ రేటు ఆధారంగా టీమిండియా ఫైనల్ కి చేరుతుంది.