వర్షంతో టీమిండియాకు నష్టమే.. !


వరుణుడి పుణ్యమా అని మంగళవారం తేలిపోవాల్సిన భారత్‌-న్యూజిలాండ్‌ సెమీస్‌ ఫలితం.. బుధవారానికి వాయిదా పడింది. ఈరోజు కూడా వర్షం పడితే.. పరిస్థితి ఏంటన్నది క్రికెట్ అభిమానులని తొలిచేస్తోంది. వర్షం మ్యాచ్‌ను తుడిచి పెట్టేస్తే లీగ్‌ దశలో కివీస్‌ కన్నా ఎక్కువ పాయింట్లతో ఉన్న భారతే ఫైనల్‌ చేరుతుందన్న సంగతి తెలిసిందే.

అలాకాకుండా.. మధ్య మధ్యలో వర్షం అడ్డుపడి.. ఆటని కుదిస్తేనే టీమిండియాకు కష్టం. డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి అమల్లోకి వస్తే.. ఆగిన చోటే న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడి ఉంటే.. ఆ తర్వాత ఆట సాధ్యమయ్యే సమయాన్ని బట్టి భారత్‌ లక్ష్యం 46 ఓవర్లలో 237, 40 ఓవర్లలో 223, 35 ఓవర్లలో 209, 30 ఓవర్లలో 192, 25 ఓవర్లలో 172, 20 ఓవర్లలో 148గా ఉండేది. బౌల్ట్‌, ఫెర్గూసన్‌, హెన్రీలను కాచుకుని ఛేదన పూర్తి చేయడం సవాలే. పిచ్‌, వాతావరణ పరిస్థితులు సవాలు విసిరేవే. ఒక్కమాటలో చెప్పాలంటే వర్షంతో టీమిండియా నష్టమా. ఈరోజు ఆట సాఫిగా సాగితేనే కోహ్లీ సేనకు లాభమని చెప్పవచ్చు. మరీ.. వరుణుడి ఏం చేస్తాడో చూడాలి.