హరీష్ కాళ్లుమొక్కబోయిన మంత్రి.. ఇదీ నిజం !
మంత్రి ఇంద్రకరన్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావు కాళ్లు మొక్కబోయిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ లతో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిముగ్గురు కాసేపు ముచ్చటించుకొన్నారు. లేచి వెళ్లే సమయంలో ఇంద్రకరణ్ రెడ్డి హరీష్ కాళ్లు మొక్కబోయారు. ఆ సీన్ చూసి అక్కడి ప్రజలు సైతం ఆశ్చర్యపోయారని ఓ ప్రత్రిక ప్రచురింది. ఐతే, ఈ వార్తని హరీష్ ఖండించారు.
దానికి సంబంధించి పేపర్ల్ క్లిప్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “ఈ వార్తపూర్తిగాఅవాస్తవం. గౌ.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేలమీది నుండి లేచినిలబడేందుకు ప్రయత్నిసుండగా సాయపడ్డాను. దీన్నితప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు. ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదిబాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణచేసుకుని ప్రచురించాలని కోరుతున్నా”నని ట్విట్ చేశారు.
ఈ వార్తపూర్తిగాఅవాస్తవం.
గౌ.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేలమీది నుండి లేచినిలబడేందుకు ప్రయత్నిసుండగా సాయపడ్డాను. దీన్నితప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు. ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదిబాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణచేసుకుని ప్రచురించాలని కోరుతున్నా pic.twitter.com/L6WEf4lLPn— Harish Rao Thanneeru (@trsharish) July 10, 2019