కర్నాటకం : కోర్టుకెక్కిన అసంతృప్త ఎమ్మెల్యేలు
కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల్లో కొన్ని సరిగా లేవంటూ స్పీకర్ రమేశ్ కుమార్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు కోర్టుకెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.. రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.
మరోవైపు అసమ్మతులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేడు ముంబయి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేలను కలవకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఎమ్మెల్యేలు అంగీకరిస్తేనే శివకుమార్ హోటల్ లోకి అనుమతినిస్తామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి కర్ణాటక రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠగా మారుతున్నాయి.