బిగ్ బాస్ పేరుతో.. పడకగది పిలుపులా.. !?

బిగ్ బాస్ తెలుగు సీజన్3 త్వరలోనే ప్రారంభం కానుంది. హోస్ట్ గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. కంటెస్టంట్ ల లిస్ట్ రెడీ అవుతోంది. ఐతే, ఈ షో మొదలుకాకముందే వివాదాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ పేరుతో లైంగికంగా వేదిస్తున్నారు. ‘మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు?’ అని అడుగుతున్నారని యాంకర్ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. శ్వేతారెడ్డిని బిగ్ బాస్ యాజమాన్యం ఏరికోరి తీసుకొంది. ఆమెతో అగ్రిమెంట్ చేసుకొంది.

అగ్రిమెంట్ తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం వ్యవహార శైలి తనని షాక్ కి గురిచేసిందని శ్వేతారెడ్డి అన్నారు. గేమ్ వివరాలను చెబుతానని పిలిచిన కోఆర్డినేటర్.. షోలో పార్టిసిపేట్ చేయడం మీకు ఇంటరెస్ట్ ఉందా..?, మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలలి ?, మీరుషోలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు ?, మీరు మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు ? అనే ప్రశ్నలు అడిగాడట. కమిట్మెంట్ అడుగుతున్నారా..? అని సీరియస్ అయ్యేసరికి.. తనని దూరం పెట్టారని.. స్టార్ మా లాంటి పెద్ద సంస్థ మోసం చేస్తుందని ఊహించలేదని శ్వేతారెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఆరోపణలు బిగ్ బాస్ కు పెద్ద మచ్చే. దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం, హోస్ట్ నాగార్జున కూడా వివరణ ఇస్తే బాగుంటుందేమో..! లేదేంటే.. బిగ్ బాస్ పేరుతో లైంగికంగా వాడుకొంటున్నారనే ఆరోపణలు ఎదుర్కోక తప్పదు.