అభిరామ్ కోసం సురేష్ బాబు కష్టాలు
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వాస్తవానికి గత యేడాదియే అభిరామ్ తొలి సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ఐతే, శ్రీరెడ్డి వ్యవహారంతో అభిరామ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో.. హీరోగా ఆయన ఎంట్రీని వాయిదా వేశారు.
అభిరామ్ కు నటనలో శిక్షణ కూడా ఇప్పించారు. ఇప్పుడా శిక్షణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో గతంలో అభిరామ్ కోసం అనుకొన్న కథలని పక్కకుపెట్టేసి.. కొత్త కథని ఎంపిక చేసే పనిలోసురేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెడీగా ఉన్న రెండు స్క్రిప్టులని నుంచి అభిరామ్ కు సూటయ్యే కథని సెలక్ట్ చేసే పనిలో ఉన్నాడు.
‘లీడర్’ సినిమాతో రానా దగ్గుపాటిని క్లాస్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఐతే, అభిరామ్ ని ఆయన బయటి ఇమేజ్ కి తగ్గట్టుగా రొమాంటిక్ హీరోగా ప్రజెంట్ చేయబోతున్నారట. రొమాంటిక్ అండ్ క్యూట్ లవ్ స్టోరిగా అభిరామ్ ఎంట్రీ సినిమా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి తనయుడు అభిరామ్ కోసం సురేష్ బాబు బాగానే కష్టపడుతున్నట్తున్నాడు.