18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి !


సెమీస్ టీమిండియా ఓటమి పాలైంది. కివీస్ నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. దీంతో 18 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకుంది.

టాప్‌ఆర్డర్‌ 5 పరుగులకే కుప్పకూలింది. ఆదుకున్నట్లే కనిపించిన పంత్‌(32), పాండ్య(32) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. అయినా ఆశల్లేని మ్యాచ్‌లో టీమిండియా గొప్ప పోరాటం చేసింది. జడేజా(77; 59బంతుల్లో 4×4, 4×6), ధోనీ(50; 72బంతుల్లో 1×4, 1×6) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను దాదాపు గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ కీలక సమయంలో ఔట్‌ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇక గురువారం జరగనున్న రెండో సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టుతో కివీస్ ఫైనల్ ఆడనుంది.