‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ టాక్

‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ.. వెళ్లి పోయాక ఎందుకింత బాధపెడుతోంది’ అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడుగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. ఈ నెల 26న డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

కాలేజీ గొడవలు. ప్రేయసి ప్రేమ, జీవితం నేర్పే పాఠాలతో ట్రైలర్ ని ఆకట్టుకొనేలా కనిపించాడు. ట్రైలర్ లో ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. గీత గోవిందంలోని విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంతే ట్రైలర్ తో కామ్రేడ్ గుండెల్ని పిండేశాడు. చివరల్లో ‘నన్ను భయపెడుతున్నారనుకుంటున్నారేమో.. మీరు భయపడుతున్నారు. కనిపిస్తోంది’ అనే డైలాగ్ బాగా పేలింది.