నితిన్ ఫ్రెష్ లుక్


యంగ్ హీరో నితిన్ ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. ఆయన కథానాయకుడుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇటీవలే సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాలో నితిన్ లుక్ ఒకటి లీక్ అయింది. ఈ లుక్ లో నితిన్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. మాంచి ఫిట్ నెస్ తో కనిపిస్తూ, కాస్త స్లిమ్ అయినట్లు అనిపిస్తున్నాడు. ఐతే, నితిన్ ప్లాప్ సినిమా ‘విక్టరీ’ లుక్ ని పోలివుంది భీష్మ లుక్.

ఈ మధ్య నితిన్ కి సరైన హిట్ లు పడడంలేదు. ఆయన నుంచి భీష్మ, రంగ్ దే, అలాగే చంద్రశేఖర్ యేలేటి సినిమాలను క్యూ కట్టనున్నాయి. ‘రంగ్ దే’ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. ఇక, డిసెంబర్ 6న భీష్మ సినిమాను విడుదల చేయడం అన్నది టార్గెట్ గా పెట్టుకొని.. జెడ్ స్వీడుతో షూటింగ్ కానిచ్చేస్తున్నారు.