మహేష్ సినిమా.. మరో లీకు !

సూపర్ స్టార్ మహేష్26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. కశ్మీర్ లో తొలి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫోటోలు లీకయ్యాయి. ఆర్మీ లుక్ లో మహేష్ పిక్స్ బయటికొచ్చాయి. వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పిక్ లీకైంది.

ఈసారి మహేష్ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. క్రీడామైదానంలో నిలబడి ఉన్నాడు. ప్రేక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో నిలబడి ఉన్నాడు. బహుశా.. హీరోయిన్ పై సీన్ చిత్రీకరించే సమయంలో అయి వుంటుంది. లీకైన పిక్స్ మహేష్ అభిమానుల కడుపునింపేస్తున్నాయి. అదే సమయంలో చిత్రబృందాన్ని టెన్షన్ పెడుతున్నాయ్. ఇలా వరుసగా లీకులు.. సినిమాపై ఆసక్తిని తగ్గించేలా ఉన్నాయని ఆందళనలో చిత్రబృందం. ఇకపై ఇలాంటి లీకులు జరగకుండా.. చిత్రబృందం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటే మంచిదేమో.. !

ఇక, సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో నిలవనుంది. అల్లు అర్జున్, రజనీకాంత్, బాలయ్యతో మహేశ్ సంక్రాంతి ఫైట్ చేయబోతున్నాడు.