ప్రభాస్ ప్రియురాలి పెళ్లి ప్రకటన
‘సాహో’లో ప్రభాస్ ప్రియురాలిగా నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్. ఆమెకి ఇదే తొలి తెలుగు చిత్రం. బాలీవుడ్ లో శ్రద్దా కపూర్ పెళ్లి హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. చిన్ననాటి స్నేహితుడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ ను పెళ్లాడనుంది అనే ప్రచారం జరుగుతోంది.
తాజాగా శ్రద్దా పెళ్లిపై ఆమె తండ్రి శక్తి కపూర్ స్పందించారు. శ్రద్దా పెళ్లి వార్తల్లో నిజం లేదు. ఇప్పట్లో ఆమె పెళ్లి చేసుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె దృష్టంతా కెరీర్ పైనే ఉందని చెప్పాడు. ఇకనైనా శ్రద్దా పెళ్లి రూమర్స్ కి చెక్ పడుతుందేమో చూడాలి. సాహో తర్వాత శ్రద్దా మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కే సినిమాలకి ఆమె మంచి ఆప్షన్ గా మారనుంది. సాహో ఆగస్టు15న విడుదల కానుంది.