భాజాపాలో చేరనున్న డీఎస్ ?


తెరాస రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ భాజాపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు సమాచారమ్. కొంత కాలంగా డీఎస్‌ తెరాసకు దూరంగా ఉంటూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్‌ కుమారుడు అరవింద్ నిజామాబాద్‌ భాజపా అభ్యర్థిగా బరిలో దిగి సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితపై విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో డీఎస్‌, తెరాస బంధం పూర్తిగా తెగిపోయినట్లేనని అంతా భావించారు. కానీ, బుధవారం ఢిల్లీలో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీకి సమావేశానికి డీఎస్‌ హాజరై షాక్ ఇచ్చారు. ఇక గురువారం ఆయన ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రితో అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది.

తెలంగాణలో ప్రజాదరణ కలిగిన నేతలని చేర్చుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మునుగోడు ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన కూడా ఓకే చెప్పేశారు. ఇక, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన డీస్ కు కమలం పార్టీ రెడ్ కార్పేట్ వేసినట్టు సమాచారమ్.