ఫైల్ కదలాలంటే.. లావణ్య లెక్క తేలాల్సిందే.. !
రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య అవినీతి భాగోతం బట్టబయలు అయింది. ఆమె చేతులో పైసా పడనిదే ఫైల్ కదలినీయడట. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఇచ్చిన సమాచారంతో హయత్‌నగర్‌లోని లావణ్య నివాసంలో బుధవారం ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు బయటపడటంతో ఆమె అవినీతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లావణ్యను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆమెను లోతుగా విచారించారు.
గతంలో లావణ్య వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని కేశంపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సరైన సమయంలో స్పందించి ఉంటే లావణ్య అవినీతి వ్యవహారం అప్పుడే బయటపడేదని బాధితులు పేర్కొంటున్నారు.